బాప్రే... నెగిటివిటీలో ఇదొక రికార్డు!
on Aug 13, 2020
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై ప్రేమ భట్ ఫ్యామిలీ తీసిన సినిమాకు శాపమైంది. మహేష్ భట్ దర్శకత్వంలో ముఖేష్ భట్ నిర్మించిన సినిమా 'సడక్ 2'. ఇందులో మహేష్ కుమార్తెలు ఇద్దరు పూజా, అలియా యాక్ట్ చేశారు. హీరోయిన్లుగా! సంజయ్ దత్, ఆదిత్యా రాయ్ కపూర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ యుట్యూబ్లో అత్యధిక డిస్ లైక్స్ సొంతం చేసుకున్న ట్రైలర్‌గా రికార్డు సృష్టించింది.
'సడక్ 2' ట్రైలర్‌కి 6.5 మిలియన్స్ ప్లస్ డిస్ లైక్స్ వచ్చాయి. గంట గంటకూ ఈ డిస్ లైక్స్ నంబర్ పైపైకి వెళుతోంది. 5.2 మిలియన్స్ డిస్ లైక్స్ దగ్గర యుట్యూబ్లో అత్యధిక డిస్ లైక్స్ సొంతం చేసుకున్న ట్రైలర్ రికార్డు 'సడక్ 2' పేరిట వచ్చింది. యుట్యూబ్లో టాప్10 డిస్ లైక్స్ పొందిన వీడియోలలో దీనికి ప్రస్తుతానికి 7వ స్థానం. అతి త్వరలో టాప్ ప్లేస్‌కి వస్తుందని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నెగిటివిటీలో ఇదొక రికార్డు అని చెప్పాలి. ట్రైలర్ మీద ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో సినిమాకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందోనని బాలీవుడ్ ఆసక్తిగా వెయిట్ చేస్తోంది.